తెహెల్కా రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 12 ప్రతినిధి ఈ.పద్మారావు కాపు:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మహేశ్వరం మోడల్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరంలో కె. నిర్జల 977/1000 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు.ఎంపీసీ గ్రూపులో టాపర్లుగా కె. నిర్జల (977/1000), టి. సుజాత (973/1000) ప్రతిభ కనబరిచారు. బైపీసీ గ్రూపులో పి. జగన్ (969/1000), జి. ప్రణవి (959/1000) అద్భుత ఫలితాలు సాధించారు. ఎంఈసి గ్రూపులో బి. భవ్య శ్రీ 923/1000 మార్కులు, సిఈసి గ్రూపులో ప్రియాంక 918/1000 మార్కులు సాధించారు. మొత్తం పది మంది విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించడం విశేషం.ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో హెప్సిబా 463/470, జె. సింధు 455/470 మార్కులు సాధించగా, సిఈసి గ్రూపులో పి. భవ్య 379/500 మార్కులు సాధించారు.మొత్తంగా కళాశాల మొదటి సంవత్సరంలో 54 శాతం, ద్వితీయ సంవత్సరంలో 58 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేసింది.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈ. గోపి మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

