(తెహెల్కా) కుత్బుల్లాపూర్ న్యూస్ ఏప్రిల్ 13,
తెలంగాణ రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన భాగ్యరధి విద్యార్థులు నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో భాగ్యరధి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ప్రథమ సంవత్సరం MPC గ్రూపులో బి. అస్మిత 468/500, BiPC గ్రూపులో జి. విష్ణు తేజ 433/440, MEC గ్రూపులో బి. శ్రీ లక్ష్మి 491/500, CEC గ్రూపులో అంబ్రిన్ బేగం 485/500 మార్కులు సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో BiPC గ్రూపులో అవేజ్ 993/1000, MPC గ్రూపులో అమృత్ మరియు శివం ప్రసాద్ 982/1000, CEC గ్రూపులో శ్రావణి 981/1000, MEC గ్రూపులో సానియా బేగం 979/1000 మార్కులతో ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్. వెంకటరెడ్డి మాట్లాడుతూ, పదవ తరగతిలో సాధారణ మార్కులు సాధించిన విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వంతో ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని, అటువంటి విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ఆర్థికంగా మరియు విద్యాపరంగా అండగా ఉంటుందని తెలిపారు.
డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరంలో ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు.అలాగే డైరెక్టర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ, ఇంటర్ ఫలితాలతో పాటు JEE Mains, NEET, EAPCET వంటి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు.జి. రమేష్ బాబు మాట్లాడుతూ, విద్యతో పాటు క్రమశిక్షణలో కూడా భాగ్యరధి విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారని, దీనికి సహకరించిన అధ్యాపకులు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
— భాగ్యరధి డిగ్రీ & జూనియర్ కాలేజ్ యాజమాన్యం

