తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు V. Hanumantha Rao నేడు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.దీర్ఘకాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహనతో రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వీ. హనుమంత రావు పేర్కొన్నారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా పని చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


