
కామారెడ్డి, మే 27 :బక్రీద్ ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్
ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని పలు ఈద్గాల వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకుని జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను ఆమె మున్సిపల్ కౌన్సిలర్లు మరియు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముస్లింల పవిత్ర పండుగ ‘త్యాగాల నిరతి బక్రీద్’ సందర్భంగా ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ తరఫున సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

మున్సిపల్ శాఖ చేపడుతున్న ముఖ్య చర్యలు ఈద్గా పరిసరాల్లో పరిశుభ్రత పనులు వేగవంతం చేయడం, పిచ్చిమొక్కల తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ,పండుగ రోజంతా శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉంచడం, ఈద్గాలకు వెళ్లే రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత వీధి దీపాల పునరుద్ధరణ, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల ,భక్తుల కోసం తాగునీటి వసతుల ఏర్పాటుఈ సందర్భంగా చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ,
“ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలి” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ డీఈ హన్మంత్ రావు, కౌన్సిలర్లు గ్యార అఖిల, వాజీద్, అంజాద్, జావీద్, అన్వర్, లడ్డు, నిట్టు గంగాధర్, కో-ఆప్షన్ మెంబర్ అలీబిన్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్యార సాయిలు, అమీర్, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది మరియు ముస్లిం మత పెద్దలు అమీర్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

