ఏప్రిల్ 12, తెహల్కా ప్రతినిధి మురళీమోహన్ గౌడ్
నాగోల్ గౌడ సంఘం ఎన్నికల నామినేషన్.సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలు అందజేసిన — బద్దం వెంకటేష్ గౌడ్.
డివిజన్లోని నాగోల్ గౌడ సంఘం గీత కార్మికుల తీర్మానం మేరకు కుల పెద్దల సమక్షంలో ఈరోజు గౌడ సంఘం అధ్యక్షుడుగా పోటీ చేయనున్న బద్దం వెంకటేష్ గౌడ్ ఈరోజు ప్యానల్ సభ్యులు ఉపాధ్యక్షులు రాగిరి సత్యనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి కంది గంటి కన్నా గౌడ్,, సంయుక్త కార్యదర్శి రావుల శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా దంతూరి జయశంకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా బంగారు కృష్ణ గౌడ్, పల్లె వెంకటేష్ గౌడ్,ప్యానల్ సాక్షి సభ్యునిగా బద్దం నరేందర్ గౌడ్, కోలన్ చంద్రశేఖర్ ఆజాద్,సభ్యులతో కలిసి, గౌడ సంఘం కోర్ కమిటీ సభ్యులు అయిన బద్దం ధనంజయ గౌడ్, కోలన్ నరసింహ గౌడ్, కట్ట ఈశ్వరయ్య గౌడ్ చెరుకు శివకుమార్ గౌడ్, గౌడ సహకార సంఘం అధ్యక్షుడు రావుల రాజు గౌడ్, కందిగంటి ఎట్టేషు గౌడ్, చెరుకు శ్రీనివాస్ గౌడ్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడుగా ఎన్నికలో బరిలో ఉన్న బద్ధం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ. గౌడ సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అందుకుగాను కోర్ కమిటీ, గీత సహకార కమిటీ పెద్దలు నిర్ణయాలకు గౌడ సోదరులు అంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని గత కొన్ని సంవత్సరాలుగా గౌడ సంఘం బాధ్యతలు చేపట్టి గౌడ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసి సేవలందించిన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ. గ్రామ గౌడ సోదరులు అందరూ మన బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 26 రోజున జరగబోయే గౌడ సంఘం ఎన్నికలతో మా కమిటీ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. అంతేకాకుండా గెలుపు ఓటమి అనేది దైవాధీనమని, గౌడ పెద్దలు సూచించిన నిర్ణయాల ప్రకారం అందరూ కలిసికట్టుగా నిర్ణయాలకు కట్టుబడి అందరం ఐకమత్యంతో ఉండాలని వారు కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ బాధ్యత వహించాలని మనం ఐక్యమత్యంతో ఉంటేనే మన అభివృద్ధి మనకు సాధ్యమవుతుందని వారు తెలుపుతూ.గౌడుల అభివృద్ధి తన కర్తవ్యంగా భావించి ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

