యాదాద్రి భువనగిరి తేహెల్క న్యూస్:

ఆలేరు మండలం,గోలనుకొండ, కొల్లూరు,మందనపల్లి,గ్రామాల్లో అదేవిధంగా ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగులు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య ప్రారంబిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని సరైన ధరకు కొనుగోలు చేయడా నికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చే పట్టిందని చెప్పారు.కనీస మద్దతు ధర (MSP) ప్రకారం ధాన్యాన్ని కొ నుగోలుచేస్తూ రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా కొనుగోలు కేం ద్రాలలో తాగునీరు,తూకం యం త్రాలు,గన్నీ సంచులు,రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా, తేమశాతం సరైనస్థాయిలో ఉంచి తీసుకురావాలని సూచించారు. ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరితగతిన జమ అ య్యేలా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,రైతులు పాల్గొన్నారు.

