ఎల్.బి.నగర్, ఏప్రిల్ 12,తేహల్కా ప్రతినిధి మురళీమోహన్ గౌడ్.

ట్రాఫిక్ అధికారులతో కలిసి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.చింతలకుంట బస్ స్టాప్ వద్ద ఉన్న డివైడర్ వెడల్పు తగ్గింపు పనులను ట్రాఫిక్ అధికారులతో కలిసి పరిశీలించిన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పైలెట్ ప్రాజెక్టు కింద చింతలకుంట వద్ద డివైడర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.కానీ అట్టి డివైడర్ దాదాపు పది నుంచి పన్నెండు ఫీట్లు వెడల్పుగా నిర్మించడం వల్ల పలు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో అట్టి డివైడర్ వెడల్పు తగ్గించాలని సుధీర్ రెడ్డి అధికారులకు సూచించారు.ఇట్టి డివైడర్ వెడల్పు తగ్గించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కొంతమేర తగ్గించవచ్చు అని తెలిపారు.అలాగే సర్వీస్ రోడ్డు వాళ్ళు కూడా సాఫీగా ప్రయాణం చేయడం జరుగుతుంది అని తెలిపారు.అనంతరం అధికారులు మాట్లాడుతూ ఎంత మేర డివైడర్ తగ్గించాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి అనుకూలంగా డివైడర్ వెడల్పు తగ్గిస్తామని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి నవీన్ రెడ్డి,సి.ఐ.వెంకటేశ్వర్లు,యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి,ఎల్బీనగర్ నియోజకవర్గం బారాస పార్టీ అధ్యక్షులు రవిముదిరాజ్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు

