
వికారాబాద్ – తెహెల్కా న్యూస్ ఏప్రిల్ 23 :
ఈరోజు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.గతంలో KCR గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే దానిని ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా డ్రైవర్ మరియు కండక్టర్ల మీద తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. కార్మికుల సమ్మెతో కాంట్రాక్ట్ డ్రైవర్లను తీసుకుని ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. మరి తెలంగాణలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది?ఆర్టీసీ సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింప చేయాలి. BRS పార్టీ తరుపున ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉంటామన్నారు.ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారితో పాటు BRS పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ధారుర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.ఈ కార్యక్రమంలో BC కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు మరియు వికారాబాద్ నియోజకవర్గ BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.

