
కామారెడ్డి జిల్లా 29-04-2026 :
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గృహప్రవేశం లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా
అడ్లూర్ గ్రామం 2వ వార్డ్ లోని లబ్దిదారుల గృహప్రవేశానికి వెళ్లి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమం లో స్థానిక 2వ వార్డ్ కౌన్సిలర్ మోతిలాల్, 1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డ మీది మహేష్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, లబ్దిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

