
మంత్రి పొన్నం ప్రభాకర్ :ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి భాద్యత ఉంది.కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు.కేబినెట్ స్థాయిలో చర్చ జరగాలని కొంత ఆలస్యం అయింది.కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసాం.రేపు జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతాం.
శ్రీధర్ బాబు మంత్రి :ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ లో చర్చ జరిగింది.ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు ప్రాణాలు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయం.
ఈ ప్రజా పాలన – ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వం.
క్షణికావేశం అన్నార్డులు జరుగుతాయి.. ప్రేరేపిత చర్యలు వద్దు.రేపు ఆర్టీసీ కార్మికులతో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో చర్చలు ఉంటాయి. ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దు.మీ కుటుంబాలకు మీ అండ అవసరం.కేబినెట్ ఎజెండా మొదలు కాకుండానే ఆర్టీసీ కేబినెట్ లో చర్చించ్చాం.

దామోదర రాజనరసింహ మంత్రి:ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి శిత్తశుద్ధి ఉంది. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆర్టీసీ ఉద్యోగిని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాం.హైదర్గుడా అపోలోలో మెరుగైన చికిత్స అందిస్తాం.ఆర్టీసీ కార్మికులు ఆవేశపడొద్దు… చర్చలు జరుపుదాం.ఆర్టీసీ కార్మికులు మా కుటుంబ సభ్యులు.బావోద్వేగాలతో సమస్యలు పరిష్కారం కావు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి :ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిధానాలు వద్దు.ఉద్యమంలో మనం కొట్లాడినం.తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వంలో 58 రోజులు సమ్మె చేసి.. 36 మంది మరణించినా పట్టించుకోలేదు.ఆర్టీసీకి 10వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది.తెలంగాణ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానుకగా ఇచ్చాము.
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నాం.


