తెహెల్కా రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 12 ప్రతినిధి ఈ.పద్మారావు కాపు:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.ఏప్రిల్ 12,2026 మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు,పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బి.దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలోని శ్రీరాం కాలనీలో యువన్ స్కూల్ ఎదురుగా ఉన్న గ్యాస్ రిపేరింగ్ షాప్‌పై దాడి నిర్వహించారు.ఈ దాడిలో ఒక వ్యక్తి గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల నుండి చిన్న సిలిండర్లకు అక్రమంగా గ్యాస్ నింపుతున్నట్లు గుర్తించారు. అతడిని మహారాష్ట్ర రాష్ట్రం లాతూర్కు చెందిన,ప్రస్తుతం జల్పల్లిలో నివసిస్తున్న దత్త బాబురావ్ మానే (28)గా పోలీసులు గుర్తించారు.పోలీసుల విచారణలో నిందితుడు గత 1–2 నెలలుగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ,చిన్న సిలిండర్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.నిందితుడి వద్ద నుండి పోలీసులు 2 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు (ఒకటి నిండి ఉన్నది, ఒకటి ఖాళీ),5 కిలోల ఇండియన్ ఖాళీ సిలిండర్,4 కిలోల చిన్న ఖాళీ సిలిండర్, గ్యాస్ ఫిల్లింగ్ పైప్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 192/2026 కింద ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం సెక్షన్ 7 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.పహాడీషరీఫ్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ,ఇలాంటి అక్రమ మరియు ప్రమాదకర కార్యకలాపాల్లో పాల్గొనవద్దని సూచించారు. ఇవి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా చట్ట విరుద్ధమని తెలిపారు.

