ePaper
Monday, May 25, 2026
📄 ePaper
HomeతెలంగాణBRSV ఫీజు పోరుబాట కార్యక్రమం

BRSV ఫీజు పోరుబాట కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

రాష్ట్ర ప్రభుత్వం 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని బి.ఆర్.ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.

విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫై తరగతులకు వెళ్లడానికి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది .ఈ ప్రభుత్వానికి బడా కాంట్రాక్టులకు కమిషన్ ఇచ్చే కాంట్రాక్టులకు బిల్లులు చెల్లిస్తుంది కానీ 13 లక్షల మంది విద్యార్థి భవిష్యత్తు కొరకు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదు .చదువుతున్న విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్ మెంటు విడుదల చేయాలని ఎన్ని నిరసనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదు .ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు మానసిక శోభకు గురై సరైన విద్యను పొందలేకపోతున్నారు .

రీయంబర్స్ మెంట్ విడుదల కాక పోవటం వల్ల విద్యార్థులు పై చదువులకోసం లేదా ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకునే వారికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు .కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వం రీయంబర్స్ మెంట్ ఇవ్వడం లేదని రాష్ట్ర హైకోర్ట్ ను ఆశ్రయించారు,ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా కౌంటర్ వేయకపోవటం వల్ల వచ్చే విద్యాసంవత్సరం 2026-27 నుంచి విద్యార్థుల దగ్గరనుండి వసూలు చేసుకోవచ్చని చెప్పడం వల్ల ఫీజు భారం విద్యార్థి మీద పడి ఉన్నత విద్యకి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది .అందుకే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి గారికి కూడా పిర్యాదు చేయాలని నిర్ణయించటం జరిగింది .

brsv నిరసన కార్యక్రమాలు

27 ఏప్రిల్ సోమవారం రోజు అన్ని జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని నిర్ణయం .

28 ఏప్రిల్ మంగళవారం రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి 1లక్ష పోస్టు కార్డుల ఫిర్యాదు కార్యక్రమం.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైకోర్టు తెలంగాణ స్టేట్
గవర్నమెంట్ సిటీ కాలేజ్ గంజి బజార్, మదీనా, చార్మినార్, హైదరాబాద్-500066.

29 ఏప్రిల్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల బంద్ నిర్వహించబడును.పై కార్యక్రమాలను విజయవంతం చేయాలని బి.ఆర్.ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మనవి.

 

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!