Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా గర్గుల మోహన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Author
Posted By TEHELKA DAILY
| 16 Oct 2026, 07:56 PM | TELANGANA
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా గర్గుల మోహన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

తెహెల్క న్యూస్ | అక్టోబర్ 16

కుత్బుల్లాపూర్: భారతీయ జనతా పార్టీ మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా గర్గుల మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గిరి వర్ధన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ సమక్షంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు గర్గుల మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతుల సమస్యల పరిష్కారానికి, రైతు సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేయాలని నాయకులు సూచించారు.

ఇవి కూడా చదవండి