Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు

Author
Posted By TEHELKA DAILY
| 01 Nov 2026, 07:03 AM |
చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు

కామారెడ్డి, అక్టోబర్ 31 (తెహెల్కా న్యూస్):

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా, ఓటు హక్కు పరిరక్షణ మరియు 'ఓటు చోరీ' ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు శనివారం బయలుదేరారు. కామారెడ్డి
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, విండో చైర్మన్ తిరుపరి భీమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్, నాయకులు ఇప్ప శ్రీనివాస్, అంకం రాజు ఉన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ., రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత నాయకులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్తున్నట్లు వారు తెలిపారు.