రవింద్ర భారతిలో మంత్రి స్పీచ్ పాయింట్స్ – వరల్డ్ హెల్త్ డే.ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం థీమ్ “Together for Health – Stand with Science” ఆరోగ్య రంగంలో శాస్త్రం, సహకారం, ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది.ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదు, శారీరక, మానసిక, సామాజికంగా ఆరోగ్యంగా ఉండడం.ప్రజల ఆరోగ్యమే అభివృద్ధి చెందిన సమాజానికి బలమైన పునాది.ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్ సేవల వల్లే ప్రజల ఆరోగ్యం రక్షితంగా ఉంది.
కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించిన వైద్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ స్థాయి వరకు ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తున్నాం.ఇన్ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్ సేవలను మెరుగుపరుస్తున్నాం.
జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి నాన్ కమ్యునికెబుల్ వ్యాధులు పెరుగుతున్నాయి.ఈ వ్యాధులు ప్రజలపై ఆర్థిక భారం పెంచుతున్నాయి.

ఈ వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరెటివ్, రిహాబిలిటేటివ్ విధానంతో సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తున్నాం.రాష్ట్రవ్యాప్తంగా NCD క్లినిక్స్, డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, పాలియేటివ్ మరియు జెరియాట్రిక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాం.డయాలిసిస్ సేవలను విస్తరిస్తూ కొత్తగా 79 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అత్యవసర సేవలను బలోపేతం చేస్తున్నాం.రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం.రూ.1100 కోట్ల వ్యయంతో నాలుగు స్థాయిల ట్రామా కేర్ వ్యవస్థను అమలు చేయబోతున్నాం.అంబులెన్స్ సేవలను బలోపేతం చేస్తూ 213 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాం.ఈ నిర్ణయంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించాం.త్వరలో మరిన్ని అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువస్తాం.10 నిమిషాల లోపు ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకునే లక్ష్యంగా పనిచేస్తున్నాం.ఈరోజు క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తున్నాం.క్యాన్సర్ రిజిస్ట్రీ ద్వారా ఖచ్చితమైన డేటాతో మెరుగైన ప్రణాళికలు రూపొందిస్తాం.ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ల ద్వారా చికిత్సను ప్రజలకు చేరువ చేశాం.ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా కీమోథెరపీ సేవలు అందిస్తున్నాం.ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో పాలియేటివ్ కేర్ అందుబాటులోకి తీసుకువచ్చాం.ఈరోజు NIMSలో అత్యాధునిక LINAC సేవలను ప్రారంభించాం.రాష్ట్రంలో రీజినల్ క్యాన్సర్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.AstraZeneca తో కలిసి 20 ప్రభుత్వ హాస్పిటళ్లలో లంగ్ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పై పైలట్ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించుకుంటున్నాం. ఇందుకోసం ఈరోకు ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకున్నాం.ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా చర్యలు ప్రారంభించాం.46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం.Clinical Establishments Act పోర్టల్‌ను ప్రారంభించాం.PCPNDT, ART, Surrogacy చట్టాల అమలుకు ప్రత్యేక పోర్టల్స్ తీసుకొచ్చాం.పారదర్శకత, నాణ్యత, బాధ్యతాయుత వ్యవస్థను తయారు చేస్తున్నాం.ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తూ ప్రజల ఆర్థిక భారం తగ్గిస్తున్నాం.ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తున్నాం.జిల్లా స్థాయిలోనే 80% వైద్య అవసరాలు తీర్చే లక్ష్యంతో సెకండరీ హెల్త్‌కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం.TIMS ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ, కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నాం.NIMSలో 2000 పడకల కొత్త భవనం నిర్మాణం జరుగుతోంది.ఆరోగ్యశాఖలిఅ రెండు సంవత్సరాల్లో 10 వేల పోస్టులు భర్తీ చేశాం.ఇంకా 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి.ఇక్కడకు వచ్చే వారంతా పేద, మధ్య తరగతి ప్రజలు..ప్రతి రోగిని గౌరవంతో, ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.క్యాన్సర్, ఇతర వ్యాధులపై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు.ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం.

