ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బుక్ కీపర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిన టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర

బుక్ కీపర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిన టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర

📰 Generate e-Paper Clip

 

మంత్రాలయం తెహెల్కా న్యూస్ :

మంత్రాలయం నియోజకవర్గంలోని బుక్ కీపర్లకు డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి 140 మొబైల్ ఫోన్లను మాధవరం లోని తన పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో సేవల అందజేతలో బుక్ కీపర్ల పాత్ర ఎంతో కీలకమని, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చి వారి పనితీరును మరింత వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రతి విభాగంలో డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో తాము ముందుంటామని పేర్కొన్నారు. ఈ చర్యతో గ్రామ స్థాయిలో పరిపాలన మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బుక్ కీపర్లు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!