
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. భాస్కరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1935 జూన్ 23న నాదెండ్ల గుంటూరులో జన్మించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16వరకు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

