ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeతెలంగాణహైకోర్టు తీర్పుకు స్వాగతం – కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించిన ఎంపీ రవిచంద్ర

హైకోర్టు తీర్పుకు స్వాగతం – కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించిన ఎంపీ రవిచంద్ర

📰 Generate e-Paper Clip

 

 

కాళేశ్వరం బహుళ దశ సాగునీటి పథకానికి సంబంధించిన జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుకు పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయి తినిపించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం సాయంత్రం కేటీఆర్‌ను రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పలువురు నాయకులకు మిఠాయిలు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు కే.పీ.వివేకానంద, కాలేరు వెంకటేష్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, నాయకులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, చిరుమళ్ల రాకేష్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కోతి కిశోర్ గౌడ్, తుంగబాలు, బోయిండ్ల విద్యాసాగర్, డాక్టర్ కురవ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ మిఠాయిలు పంచి తన ఆనందాన్ని ఎంపీ రవిచంద్ర పంచుకున్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!