Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్

Author
Posted By TEHELKA DAILY
| 16 Oct 2026, 11:33 AM | Array
సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్

ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 62 వేల ఉద్యోగాలు తగ్గాయి – మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ హయాంలో కొత్త గనులు రాలేదు.. వేలంలో పాల్గొనడాన్ని సమర్థించిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు

హైదరాబాద్: సింగరేణి సంస్థ, కొత్త బొగ్గు గనుల కేటాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. సరైన సమాచారం లేకుండానే కేటీఆర్ మాట్లాడుతున్నారని, కేవలం హైప్ కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణిలో లక్ష ఉద్యోగాల నుంచి 38 వేల ఉద్యోగాలకు సంఖ్య తగ్గిందని, ఈ కాలంలో 62 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని మంత్రి పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త గని కూడా తీసుకురాలేదని విమర్శించారు.
కొత్త గనుల వేలం విషయంలో గతంలో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో అనుకూలంగా ఓటు వేశారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కావాలంటే ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అవకాశం ఇచ్చినప్పటికీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ఆ అవకాశాన్ని కోల్పోయిన తర్వాత, కేంద్రం వేలం నిర్వహించిన సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, వేలంలో పాల్గొంటేనే రాష్ట్రానికి కొత్త గనులు, ఉద్యోగావకాశాలు వస్తాయని వివరించినట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పాల్గొనడం వల్లే తన నియోజకవర్గంలో OC మైన్ సాధ్యమైందని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కొత్త గనుల ఏర్పాటు ద్వారా సింగరేణి అభివృద్ధితో పాటు స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు.