Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దివ్యాంగుల ఆత్మవిశ్వాసం, స్వావలంబనకు సమాజం అండగా నిలవాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

Author
Posted By TEHELKA DAILY
| 16 Oct 2026, 07:58 PM | Array
దివ్యాంగుల ఆత్మవిశ్వాసం, స్వావలంబనకు సమాజం అండగా నిలవాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్ : అక్టోబర్ 16 : తెహల్క న్యూస్

లూయిస్ బ్రెయిలీ భవన్‌లో ఘనంగా ప్రపంచ తెల్లకర్ర దినోత్సవం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

ప్రపంచ తెల్లకర్ర దినోత్సవం (వరల్డ్ వైట్ కెన్ డే ) మరియు భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130వ డివిజన్ పరిధిలోని సూరారంలోని లూయిస్ బ్రెయిలీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దృష్టిలోపం ఉన్నవారికి తెల్లకర్ర కేవలం నడకకు ఉపయోగపడే సాధనం మాత్రమే కాదని, అది వారి ఆత్మవిశ్వాసానికి, స్వతంత్రంగా జీవించే హక్కుకు ప్రతీక అని పేర్కొన్నారు. దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. వారి ప్రతిభను గుర్తించి, విద్య, ఉపాధి, సామాజిక అవకాశాల్లో సమాన ప్రాధాన్యత కల్పించడం మనందరి బాధ్యత అని అన్నారు.

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ప్రస్తావిస్తూ కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.

దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ వారికి అవసరమైన సహకారం అందించడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, కొంపల్లి మాజీ మున్సిపల్ ఛైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, స్థానిక సీనియర్ నాయకులు వరాల వినోద్, కోలా శ్రీకాంత్, గుబ్బల లక్ష్మీనారాయణ, గట్టు అశోక్, రాజ్ కుమార్, జన్ముల ప్రభాకర్, రామ్ బాబు, బైరేష్ గౌడ్, సత్యం గౌడ్, చిన్న వెంకటస్వామి, రాజు, అనీల్, గణేష్, మటన్ మహమూద్, బద్రి, జహీర్, మరియు
లూయిస్ బ్రెయిలీ భవన్ ప్రతినిధులు, నిర్వాహకులు, అంజయ్య గౌడ్, ప్రవీణ్ గౌడ్, వీర రాఘవన్, యాదయ్య యాదవ్, నరేందర్ రెడ్డి, శేఖర్ గౌడ్ మరియు స్థానిక నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.