Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి.

Author
Posted By TEHELKA DAILY
| 01 Nov 2026, 07:01 AM |
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి.

బాల్యంలోనే విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన ఉండాలి-బిక్కనూరు ఎస్ఐ అనిల్.

కామారెడ్డి, అక్టోబర్ 31 (తెహెల్కా న్యూస్)

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి. - Additional Image

విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ అనిల్ సూచించారు. శనివారం బిక్కనూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని స్థానిక పోలీసు స్టేషన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు పోలీసులు అందించే సేవల గురించి వివరించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, సాంకేతిక పరికరాలు, పెట్రోలింగ్ వాహనాలు మరియు ఇతర పోలీస్ సామగ్రిని విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వాటి వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా విద్యార్థులు పోలీస్ శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు పోలీసుల విధులు, బాధ్యతలు మరియు సమాజంలో పోలీసుల పాత్ర గురించి అవగాహన పొందారు. బాల్యంలోనే విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన ఉండాలన్నారు. పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పించడం, పోలీస్ శాఖపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసులను సంప్రదించాలని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు.

ఇవి కూడా చదవండి