Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై RLD దృష్టి – జాతీయ నాయకత్వంతో కీలక సమావేశం

Author
Posted By TEHELKA DAILY
| 04 Nov 2026, 09:15 AM |
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై RLD దృష్టి – జాతీయ నాయకత్వంతో కీలక సమావేశం

రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) – తెలంగాణ రాష్ట్ర విభాగం

న్యూఢిల్లీ / హైదరాబాద్:

రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) తెలంగాణ రాష్ట్ర విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల సూచనలు, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు, పార్టీ భవిష్యత్తు రాజకీయ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులుగా క్రింది నాయకుల పేర్లను ప్రతిపాదించడం జరిగింది.

1. డాక్టర్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు – హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం.
2. శ్రీ గౌర బీరప్ప గారు – వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం.

న్యూఢిల్లీలో RLD జాతీయ నాయకత్వంతో తెలంగాణ రాష్ట్ర నాయకుల కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ కపిలవాయి దిలీప్ కుమార్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర నాయకులు న్యూఢిల్లీలో రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ప్రతిపాదనలు, తెలంగాణలో పార్టీ విస్తరణ, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నాయకులు:

* డాక్టర్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి – రాష్ట్ర ఉపాధ్యక్షులు.
* శ్రీ గౌర బీరప్ప – రాష్ట్ర అధికార ప్రతినిధి.
* శ్రీ మచ్చా రాజ్‌కుమార్ రెడ్డి – రాష్ట్ర యువజన అధ్యక్షులు.
* శ్రీ కుండె గిరి – రాష్ట్ర కోశాధికారి.

జాతీయ నాయకులతో మర్యాదపూర్వక భేటీ

ఈ సందర్భంగా రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ జయంత్ సింగ్ గారు, RLD పార్లమెంటరీ బోర్డు చైర్మన్, మాజీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు శ్రీ కె.సి. త్యాగి గారు, RLD జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సమర్పాల్ గారు, పార్టీ యువజన విభాగం మరియు మీడియా కోఆర్డినేటర్ శ్రీ భూపేంద్ర చౌదరి గారు తదితర జాతీయ నాయకులను కలిసి తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలను వివరించడం జరిగింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్ర నాయకత్వం సమర్పించిన అభ్యర్థుల ప్రతిపాదనలు, ఎన్నికల ప్రణాళికలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

ఈ సందర్భంగా జాతీయ నాయకులు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం మొత్తం ఐక్యంగా పనిచేసి ప్రతిపాదిత అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

అవసరమైన సమయంలో తాము కూడా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల విజయానికి సహకరిస్తామని హామీ ఇవ్వడం రాష్ట్ర నాయకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

సమకాలీన రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ

ఈ సమావేశంలో సమకాలీన జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు (Contemporary Politics), తెలంగాణలో RLD పార్టీ భవిష్యత్తు, పార్టీ సంస్థాగత విస్తరణ, యువతకు రాజకీయ అవకాశాలు, పట్టభద్రుల సమస్యలు, రైతుల సంక్షేమం, ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది.

తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయడానికి జాతీయ నాయకత్వం మార్గదర్శకత్వంలో సమిష్టి కార్యాచరణ చేపట్టాలని చర్చించడం జరిగింది.

జాతీయ నాయకత్వం దిశానిర్దేశం – తెలంగాణ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి

రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ నాయకత్వం సూచనలు, మార్గదర్శకత్వం మేరకు తెలంగాణ రాష్ట్ర విభాగానికి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలకు అతీతంగా పార్టీ ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ప్రతిపాదిత అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తమ వంతు కృషి చేయాలని కోరుతున్నాము.

మన లక్ష్యం కేవలం ఎన్నికల్లో విజయం సాధించడం మాత్రమే కాదు. తెలంగాణలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, పట్టభద్రులు, యువత, రైతులు మరియు సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావించే రాజకీయ వేదికగా అభివృద్ధి చేయడం.

రాష్ట్రీయ లోక్ దళ్ (RLD)
తెలంగాణ రాష్ట్ర విభాగం