Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు 60 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!

Author
Posted By TEHELKA DAILY
| 28 Nov 2026, 04:45 PM | TELANGANA
మంత్రి  దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు 60 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!

(తెహల్కా న్యూస్ )మెదక్ :

మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు టేక్మాల్ లో 60 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టేక్మాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు 20,76, 500 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. శనివారం టేక్మాల్ రైతు వేదిక సిఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమo నిర్వహించారు. తాసిల్దార్ తులసి రామ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆపదలోపన్నహస్తం అందించేందుకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టేక్మాల్ గ్రామ సర్పంచ్ సుధాకర్, మండల మాజీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, మెదక్ జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ షేక్ మజహర్, మెదక్ జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, జోగిపేట్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, అవినాష్, నరసింహారెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు అధికారులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్నారు.