ఎల్బీనగర్,నాగోల్, ఏప్రిల్ 22,తేహేల్కా:
(ప్రతినిధి మురళీమోహన్ గౌడ్)
అరుణోదయ కాలనీ నూతన కమిటీ సభ్యులు నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కమిటీ సభ్యులను ఆత్మీయంగా ఆహ్వానించి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సమావేశంలో కాలనీలో ఉన్న పలు ముఖ్య సమస్యలను కమిటీ సభ్యులు వివరంగా మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా రహదారుల దుస్థితి, డ్రైనేజ్ వ్యవస్థలో లోపాలు, తాగునీటి సరఫరా సమస్యలు, వీధి దీపాల నిర్వహణ, చెత్త నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కాలనీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల మెరుగుదలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కార్పొరేటర్ సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలనీ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు మరియు ప్రజలు సమిష్టిగా సహకరించాలని సూచించారు.

