సిద్దిపేట : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, ఈ విషయంలో సమ్మె పై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ డిమాండ్ చేశారు.సిద్దిపేట బస్ డిపో ముందు జరిగిన సమ్మెను ఉద్దేశించి ఆయనమాట్లాడుతూ
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.ఎన్నికల హామీమేరకు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.
ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఆగిపోయిన రెండు వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. కార్మికుల ఐక్య పోరాటంతోనే హక్కుల సాధన సాధ్యం అని, సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రైవేటు డ్రైవర్ల ప్రయోగం ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని, సమ్మెను అణచివేసేందుకు ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం,ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి గత ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్,ఆర్టీసీ జేఏసి నాయకులు రాజయ్య,మల్లేశం,రవీందర్ గౌడ్,రాములు,బి ఎస్ గౌడ్,హేమలత,రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు

