కూకట్ పల్లి తెహెల్కా న్యూస్ ప్రతినిధి తెల్ల హరికృష్ణ ఏప్రిల్ 22:
కూకట్పల్లి మూసాపేట్ వై జంక్షన్ నుండి మియాపూర్ వరకు ట్రావెల్స్ బస్సుల వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ బుధవారం భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు పార్టీ శ్రేణులతో కలిసి కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కారించేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, స్కై వే వాకింగ్ వంటి ప్రత్యామ్నామ్య ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నపట్టికీ వాహనదారులకు ట్రాఫిక్ ఫ్రీ నగరం అనేది అందని ద్రాక్షగానే మిగిలింది, దీనికి తోడు ట్రావెల్స్ బస్సుల హడావుడి అంతా ఇంతా కాదని, ముఖ్యంగా మూసాపేట్ వై జంక్షన్ నుండి మియాపూర్ వరకు ట్రావెల్స్ బస్సుల వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను, నిర్ణిత సమయాల్లో ట్రావెల్స్ బస్సులను నగరంలోకి అనుమతించాలని తద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని మరీ ముఖ్యంగా అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలకు ఎటువంటి ఆటంకం ఉండదని కుకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీకి కి వినతి పత్రం అందజేయడం జరిగిందని, అందుకు వారు సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా కాంతారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి దేశబత్తుల సుధరవి, వినోద్ గౌడ్, డాక్టర్ వంశీ, సుధ, ప్రసాద్, నర్వ పవన్, తోట రమేష్, రేపన్ రాజు, సూరి బాబు, రవి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

