తెహెల్కా న్యూస్ ప్రతినిధి తెల్ల హరికృష్ణ ఏప్రిల్ 22
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు పరస్పరం గౌరవం, మర్యాదతో వ్యవహరించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవిలో ఉన్న నాయకుడిని వ్యక్తిగతంగా దూషిస్తూ “టెర్రరిస్ట్” అని సంబోధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. నేడు మూసాపేట్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మూసాపేట్ మాజీ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మహానేత అని కొనియాడారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్టను మరింత పెంచిన నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. అలాంటి నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని, ఇది రాజకీయ సంస్కృతికి మచ్చతెచ్చే చర్య అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్న నాయకులపై ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో అపోహలు సృష్టించబడతాయని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ అసహనాన్ని బయటపెడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండటం సహజమే అయినప్పటికీ, అవి వ్యక్తిగత స్థాయికి దిగి దూషణలుగా మారకూడదని ఆయన సూచించారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాల ముందు భారత్ గౌరవాన్ని నిలబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. అలాంటి సమయంలో ప్రతిపక్ష నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. సుమారు 25 సంవత్సరాలుగా ఒక్క సెలవు తీసుకోకుండా ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం ప్రజా అభివృద్ధి కోసం పాటుపడిన మహా నాయకుడు నరేంద్ర మోడీ ని కించపరచడం సిగ్గుమాలిన చర్యగా మేం భావిస్తున్నామన్నారు, సూర్యుడిపై ఉమ్మేస్తే వారి ముఖం మీదే పడుతుందన్న భావన కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాలన్నారు, గత నాలుగు దశాబ్దాలుగా ఈ దేశంలో టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్సే అని గుర్తు ఎరగాలన్నారు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా టెర్రరిస్టుల దాడులతో, ఉగ్రవాదులు పేల్చిన బాంబులతో వేలాదిమంది చనిపోయిన విషయం లక్షలాదిమంది బిక్కుబిక్కుమంటూ బతికిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాలన్నారు, మల్లికార్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో పుట్టగతులు లేకుండా మారే పరిస్థితి ఉందని, ప్రజలందరూ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా పాతరేసే రోజులు అతి త్వరలో ఉన్నాయని గ్రహించాలన్నారు, పిచ్చి పిచ్చి ప్రేమ మాటలతో మరి ఇంకోసారి ఏ నాయకుడు నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు దేశ ప్రజలంతా ఏకధాటిగా కాంగ్రెస్ ఆఫీసులపై నాయకులపై దాడి చేసే రోజులు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. వైఖరిపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, దేశ గౌరవాన్ని కాపాడే విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మూసాపేట్ డివిజన్ పూర్వ అధ్యక్షులు పిట్ల మనోహర్, మల్లేష్ గౌడ్, ఐలయ్య, బీజేపీ మహిళా మోర్చ డివిజన్ అధ్యక్షులు జానకి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి రవి గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షులు డి శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ చారి, రాజేందర్ గౌడ్, డివిజన్ కార్యదర్శి కృ, ఓబీసీ మోషే డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు చక్రధర్, బీజేవైఎం జిల్లా నాయకులు క్రాంతి, సంతోష్, బైండ్ల రవి, మహిళా నాయకులు రాజేశ్వరి, రాధిక, బాలమణి జ్యోతి, సీనియర్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

