ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న 30 శాతం ఫిట్మెంట్, వేతన బకాయిల చెల్లింపు చేయాలన్నారు.
పీఎఫ్, సీసీఎస్ కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. యూనియన్ల పునరుద్ధరణ చేయాలన్నారు.తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు వినతి పత్రాలను అందించినా స్పందన లేకపోవడం శోచనీయమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.లేనిపక్షంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు.
ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది.
బుధవారం అర్థరాత్రి నుంచి కార్మికులు విధులు బహిష్కరించడంతో ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

