
తెలంగాణ భవన్ :
కాళేశ్వరం కేసు హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది.మేధా పర్వతం లాంటి కేసీఆర్ పై ఉమ్మేస్తే, తిరిగి కాంగ్రెస్ నాయకుల పైనే పడింది.తెలంగాణ ప్రజానికాన్ని ఒకతాటిపైకి తెచ్చి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్.1969 లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పుడు తెలంగాణ కోసం 420 మంది అమరులయ్యారుఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళు , నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్.వచ్చిన తెలంగాణలో రైతులు సంతోషంగా ఉండాలని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారు.సుంకీశాల వాల్, పెద్ద వాగు, వట్టేం మునిగిపోయింది , SLBC కుంగిపోయి 8 మంది చనిపోయారు. దీని పై ఎందుకు విచారణ చెయ్యలేదు.కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్యారేజ్ మేడిగడ్డ , అందులో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి.8B , 8C ద్వారా నోటీసులు ఇవ్వకుండా కాళేశ్వరం కేసు విషయంలో విచారణ చేశారు.
రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, అన్ని వర్గాల వారు ప్రభుత్వం పై కోపంతో ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది.రెండేళ్లకు పైగా అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆర్టిసి కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదు.బిఆర్ఎస్ హయంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పై కేబినెట్ లో నిర్ణయం తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఆ ఫైల్ ను గవర్నర్ దగ్గరకు పంపించాము.ఆ తర్వాత బిఆర్ఎస్ అధికారం కోల్పోయింది.వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలో టెంట్ హౌస్ వారికి పోలీస్ హెచ్చరిక జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు.ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామాన్లు ఇవ్వరాదు అని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, దీని పై రాష్ట్ర DGP సమాధానం చెప్పాలి.
కాళేశ్వరం అంటే 100 కంపోనెట్లు అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి, మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి లక్ష కోట్ల అవినీతి అంటూ మా పై దుష్ప్రచారం చేశారు.మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లను రిపేర్ చేస్తామని L&T ముందుకు వస్తే బెదిరించారు.మేడిగడ్డ కుంగినప్పుడు ఆగమేఘాల మీద వచ్చిన NDSA, SLBC కుంగి 8 మంది చనిపోతే ఎందుకు రాదు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాము.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం వచ్చింది.వచ్చిన ధాన్యం చూసి కేంద్రమే ఆశ్చర్యపోయింది.ఆఖరికి వరి మేము కొనలేమని కేంద్రం చెప్పింది.కాళేశ్వరంతో సంబంధం లేకుండానే వరి సాగు అత్యధికంగా వచ్చిందని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసుకుంది.ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, పరిపాలన మంచిగా చెయ్యమని, బిఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం కాదు.కేరళ రాష్ట్రానికి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేశారు.ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి NDA కూటమి నేతలతో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడు.రేవంత్ రెడ్డి అలా చేస్తుంటే
తెలంగాణలో ఉండే నిజమైన కాంగ్రెస్ నాయకులకు సోయి లేదా రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన నడుస్తుంది.కాళేశ్వరం కేసు విషయంలో హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు, ఇప్పటికైన బుద్ధి తెచ్చుకొని పరిపాలన చెయ్యండి .
ఈ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి ,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ పాల్గొన్నారు .

