Home

తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ నియామ కం - అభినందనలు తెలిపిన పార్టీ అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన యువ నాయకు డు శ్రీ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ను నియమిస్తూ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ, శ్రీనివాస్ పటేల్ లాంటి యువ,ఉత్సాహవంతులైన నాయకులు పార్టీలోకి రావడం పార్టీ బలోపేతానికి ఎంతో అవ సరమని, ఎన్నో ప్రజల సమస్య లను వెలుగులోకి తీసుకురావ డంలో ఆయన కీలక పాత్ర...

చెకుముకి సైన్స్ సంబురాలు విజయవంతం చేయండి!

సూర్యాపేట, నవంబర్ 3 (బ్యూరో చీఫ్ వై వి) సామాన్య ప్రజానీకంలో సైన్స్ ను ప్రచారం చేస్తూ రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలు అలవర్చుకొనేందుకు కృషి చేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. “ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, దేశం కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్, పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్" అనే నినాదాలతో 1988 ఫిబ్రవరి 28న పురుడు పోసుకున్న జేవీవీ గత 38 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలతో తెలుగు ప్రజల...

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై RLD దృష్టి – జాతీయ నాయకత్వంతో కీలక సమావేశం

రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) – తెలంగాణ రాష్ట్ర విభాగం న్యూఢిల్లీ / హైదరాబాద్: రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) తెలంగాణ రాష్ట్ర విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల సూచనలు, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు, పార్టీ భవిష్యత్తు రాజకీయ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులుగా క్రింది నాయకుల పేర్లను ప్రతిపాదించడం జరిగింది. 1. డాక్టర్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు – హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం. 2. శ్రీ గౌర బీరప్ప...

కుటుంబ సౌభాగ్యానికి మూలస్తంభం – గృహిణి

వేతనం లేని నిశ్శబ్ద సేవకు వందనం. జీతం తీసుకోని కార్మికురాలు. ఇంటిని నడిపించే యజమానురాలు. జాతీయ గృహిణుల దినోత్సవం సందర్బంగా గృహిణులందరికి "తెహెల్కా న్యూస్" కృతజ్ఞతలు. ఉమ్మడి నిజామాబాదు బ్యూరో, నవంబర్ 2 ( తెహేల్కా న్యూస్) "ఇల్లాలు లేని ఇల్లు చీకటి కొట్టు" అంటారు. ఒక ఇంటిని నడపడంలో, ఆ ఇంటిని ఒక నందనవనంగా మార్చడంలో గృహిణి పాత్ర అమూల్యమైనది. ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ, ఇంటిని చక్కదిద్దే బాధ్యతను నిస్వార్థంగా నిర్వర్తించే గృహిణుల శ్రమ సాటిలేనిది. ఒక దేశపు...

మట్టి ప్రమిదలు బదులుగా, గో పంచగవ్యాలతో తయారు చేసిన లక్ష్మీ దీపాలు

దీపావళి, కార్తీక మాసం లక్ష్మీ దీపోత్సవం ,దీపావళి మరియు కార్తీక మాసం పండుగల సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. మట్టి ప్రమిదలు బదులుగా, గో పంచగవ్యాలతో తయారు చేసిన లక్ష్మీ దీపాలతో నెయ్యి ఒత్తులతో దీపాలు వెలిగించడం వల్ల, పర్యావరణం లో కాలుష్యం నివారించడంతోపాటు, ఈ దీపాలు తయారు చేసిన మహిళలకు ఆర్థిక సహకారం అందించిన వాళ్ళము అవుతాము. ఈ కార్యక్రమం ద్వారా - గోశాలలు స్వయం సమృద్ధిగా నిర్వహించబడతాయి తద్వారా గోరక్షణ జరుగుతుంది - మహిళలకు ఉపాధి కలుగుతుంది - పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించిన...

తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ కామారెడ్డి, అక్టోబర్ 31 (తెహెల్కా న్యూస్) తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (ఏక్తా దివస్) వేడుకలను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఉక్కు మనిషి, జాతీయ సమైక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్, వైస్...

చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు

కామారెడ్డి, అక్టోబర్ 31 (తెహెల్కా న్యూస్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా, ఓటు హక్కు పరిరక్షణ మరియు 'ఓటు చోరీ' ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు శనివారం బయలుదేరారు. కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, విండో చైర్మన్ తిరుపరి భీమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్, నాయకులు ఇప్ప శ్రీనివాస్, అంకం రాజు ఉన్నారు. ఈ సందర్బంగా...

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి.

బాల్యంలోనే విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన ఉండాలి-బిక్కనూరు ఎస్ఐ అనిల్. కామారెడ్డి, అక్టోబర్ 31 (తెహెల్కా న్యూస్) విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ అనిల్ సూచించారు. శనివారం బిక్కనూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని స్థానిక పోలీసు స్టేషన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు పోలీసులు అందించే సేవల గురించి వివరించారు....

విద్యా జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా AWS స్టూడెంట్ కమ్యూనిటీ డే–2026

విద్యా జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VJIT)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సహకారంతో AWS స్టూడెంట్ కమ్యూనిటీ డే–2026 కార్యక్రమాన్ని 2026 అక్టోబర్ 30న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 15 మంది ప్రముఖ వక్తలు పాల్గొని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) గురించి తమ విలువైన జ్ఞానాన్ని, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. AWS అనేది...

మూడు రోజుల్లోనే రూ.653 కోట్ల మద్యం ??

తెలంగాణలో దసరా వేళ మద్యం అమ్మకాల జోరు.. మూడు రోజుల్లోనే రూ.653 కోట్ల మద్యం లిఫ్ట్‌ అక్టోబర్‌ 19 నాటికి డిపోల నుంచి రూ.2,054.51 కోట్ల మద్యం తరలింపు.. గతేడాది కంటే భారీ పెరుగుదల గతేడాది ఇదే సమయానికి రూ.1,499.46 కోట్ల మద్యం మాత్రమే లిఫ్ట్‌.. ఈసారి రికార్డు స్థాయిలో సరుకు తరలింపు

హైదరాబాద్‌లో నారెడ్కో ప్రాపర్టీ షో - అక్టోబర్ 30 నుంచి

హైదరాబాద్: నారెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో 16వ ప్రాపర్టీ షో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు హైటెక్స్‌లో జరగనుంది. ఐటీ, జీసీ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఊపు కొనసాగుతున్న తరుణంలో ఈ షో నిర్వహిస్తున్నారు. డెవలపర్లు, బ్యాంకులు, పరిశ్రమ వర్గాలు పాల్గొననున్నాయి. వివిధ విభాగాల ప్రాజెక్టులు, ఫైనాన్సింగ్ సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంటుంది. ప్రకటన కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ కె. శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఆర్. వేంకటేశ్వరరావు, ట్రెజరర్ కొండల సుధాకర్...

రవీంద్రభారతిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు

Oct 22 హైదరాబాద్: తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన, ముదిరాజుల ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని పండుగ సాయన్నకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ మహబూబ్నగర్...

కచ్చిర్ కాడి ముచ్చట్లు...

IAS, IPS కావాల్సిన బిడ్డల్ని....... రాజకీయ వారసులుగా ఎందుకు మారాలనీ అనుకుంటున్నారు ...? చదివినోడు.... చదువు కన్నా పలుకుబడున్నోడు పెత్తనం ముందు " ఎస్ సర్ " అనాలే....! ఇయ్యాల మనూరు కచ్చిర్ కాడి ముచ్చట్ల ఎజెండా కొంచెం ఘాటుగనే ఉంటది. ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ముచ్చట కాదు..మన సమాజం ఆలోచనా విధానానికి సంబంధించిన ముచ్చట!ఒక బిడ్డ IAS కావాలంటే ఏండ్ల తరబడి చదవాలె..!IPS కావాలంటే కఠినమైన పరీక్షలు దాటాలె..!కానీ ఒక నాయకుడి వారసుడిగా రాజకీయాల్లోకి రావాలంటే ఆ కుటుంబంపేరు, పలుకుబడి,...

తిరుమల సమాచారం.....

తిరుమల తాజా సమాచారం

ఏసీబీ (ACB) చిక్కిన కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అమీర్ హుస్సేన్, క్రైమ్ బ్యూరో చీఫ్

మేడ్చల్-మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌పై అక్రమ ఆస్తుల కేసు నమోదు మేడ్చల్-మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, శ్రీ అర్కపల్లి ఆంజనేయులు తన సర్వీసు కాలంలో అవినీతి పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులను కూడగట్టుకున్నట్లు గుర్తించిన 'సిటీ రేంజ్-1' అధికారులు ఆయనపై అక్రమ ఆస్తుల కేసును నమోదు చేశారు. ఇది 'ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988' (2018 సవరణ చట్టం)లోని సెక్షన్ 13(1)(b) మరియు 13(2) ప్రకారం శిక్షార్హమైన నేరం కావడంతో,...

తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్, 17-10-2026: తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ వి. వాసు రెడ్డి ఆధ్వర్యంలో, చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి. వెంకట రమణ రెడ్డి సమక్షంలో, తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యదర్శి శ్రీమతి విమల నాయకత్వంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని, బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం...

జర్నలిస్ట్ రఘు అకాల మృతి తీరని లోటు-TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ

తన ఆప్తమిత్రుడు, సీనియర్ పాత్రికేయుడు, RNA మీడియా సంస్థ చీఫ్ ఎడిటర్ అవ్వారి రఘు అకాల మృతి మీడియా రంగానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అన్నారు. శనివారం నాడు కోకాపేట లోని రఘు నివాసంలో మృతదేహాన్ని ఆయన సందర్శించి నివాళి అర్పించారు. రఘుతో తనకు మూడు దశాబ్దాల బంధం ఉందని, సాదాసీదా వ్యక్తిత్వం కలిగి ఉన్న ఆయన ఏ సంస్థలో పనిచేసినా, వృత్తి పట్ల తన నిబద్దతను, అంకితభావాన్ని ప్రదర్శించేవారని విరాహత్...

గోపిరెడ్డి నగర్ లో బతుకమ్మ ఆట.. పాట

కోదాడ ,అక్టోబర్17 (తెహల్కా న్యూస్) పట్నంలోని గోపిరెడ్డి నగర్ లో ఏడవ రోజు బతుకమ్మను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు,ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు కోదాడ పట్టణం గోపిరెడ్డి నగర్ లో ఘనంగా ఏర్పాటు చేశారు గోపిరెడ్డి నగర్ బతుకమ్మ కమిటీ నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, మహిళా మండ లి అధ్యక్షురాలు నూనె సులోచన మాట్లాడుతూ. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి...

యాదగిరిగుట్టలో అంగరంగ వైభ వంగాబతుకమ్మ మహిళల ఆట పాటలతో మార్మోగిన వేడుకలు. పాల్గొన్న ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య,బీర్ల అనిత.

తెహల్కా న్యూస్ భువనగిరి (17-10-2026) యాదగిరిగుట్టపట్టణంలోమున్సి పల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భారత్ గౌడ్,కౌన్సిలర్ల,మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో బతుక మ్మ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథు లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత హాజరైమహిళలతో కలిసి బతుక మ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదా యాలకు ప్రతీకగానిలిచే బతుక మ్మ పండుగను పురస్కరించుకు ని నిర్వహించిన ఈ వేడుక లు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.మహిళలు సంప్ర దాయ దుస్తులు...

బతుకమ్మ వారసత్వాన్ని భావితరాలకు అందించాలి-మంత్రి సీతక్క పిలుపు

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క హైదరాబాద్ ,అక్టోబర్ 17: పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప ఆస్తి, పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలు సాంస్కృతిక విలువలు వంటి బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాలని పంచాయతీరాజ్ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. సోమాజిగూడ లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో శుక్రవారం నాడు నిర్వహించిన బతకమ్మ పండుగ సంబరాలకు మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో బతుకమ్మ ఆడారు. తెలంగాణలో ఆడపడుచు ఇంటికి వచ్చిన సందర్భంగా...